గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 11:49:59

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందజేత

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందజేత

యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని రహదారి బంగ్లాలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో నిరుపేదల ఆడపిల్లల తల్లిండ్రులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కరోనాపై ప్రజలు ఆందోళనకు గురికావొద్దన్నారు. భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ లు, శానిటైజర్ లు వాడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు


logo