శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 19:44:56

లక్ష్మీనరసింహస్వామికి వారికి బంగారు కిరీటాల బహూకరణ

లక్ష్మీనరసింహస్వామికి వారికి బంగారు కిరీటాల బహూకరణ

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి బుధవారం ఇద్దరు భక్తులు వేర్వేరుగా బంగారు కిరీటాలు, వెండి శఠగోపం పాత్రను బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన నేలంటి జయమ్మ, అతడి కుమారుడు బాలాజీగుప్తా కుటుంబ సభ్యులు కలిసి 135 గ్రాములతో తయారు చేయించిన రెండు బంగారు కిరీటాలు ఆలయ అధికారులకు అందజేశారు. అలాగే భువనగిరికి చెందిన వెంకటనరసింహాచార్యుల కుటుంబ సభ్యులు 950 గ్రాముల వెండితో తయారు చేసిన శఠగోపం, ప్లేటును బహూకరించారు.logo