శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 13:32:31

అంబులెన్స్ ల కొనుగోలు కోసం మంత్రి కేటీఆర్ కు చెక్కుల అందజేత

అంబులెన్స్ ల కొనుగోలు కోసం మంత్రి కేటీఆర్ కు చెక్కుల అందజేత

యాదాద్రి భువనగిరి : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’  కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. తన పుట్టి రోజుకు కానుకలు వద్దు, పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించండని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంత్రి పిలుపునకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్పందిస్తూ సామాజిక సేవలో భాగస్వాములు అవుతున్నారు.

తాజాగా మునుగోడు నియోజకవర్గానికి రెండు అంబులెన్స్ ల కొనుగోలు కోసం (ఒక్కటి 20 లక్షల 50 వేల రూపాయలు) రెండు చెక్కులను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రీజెన్సీస్ అధినేత ఇంద్రసేనా రెడ్డితో కలిసి హైదరాబాద్ లో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. 


logo