శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 15:32:43

అంబులెన్స్ ల కొనుగోలు కోసం మంత్రి కేటీఆర్ కు చెక్కు అందజేత

అంబులెన్స్ ల కొనుగోలు కోసం మంత్రి కేటీఆర్ కు చెక్కు అందజేత

నాగర్‌కర్నూల్ :  ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అంబులెన్స్ ల కొనుగోలు కోసం రూ.41 లక్షల రూపాయల చెక్కును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని అభినందించారు. మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గిప్టులు వద్దు పేదల ముఖాల్లో చిరు నవ్వులు పూయించండని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.


logo