గురువారం 16 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 19:40:44

హైదరాబాద్‌లో పాత భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం

హైదరాబాద్‌లో పాత భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగర పాలక సంస్థ పాత భవనాల కూల్చివేతకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. నగరంలో ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలను గుర్తించి వాటిని కూల్చివేయనుంది. జంటనగరాల్లో 70 ఏండ్లకు మునుపు కట్టిన 60 పాత భవనాలను  అధికారులు గుర్తించారు. వర్షా కాలంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ ఈ డ్రైవ్‌ను చేపట్టింది.

గతంలో వర్షాలకు పాత భవనాలు నాని కూలిన ఘటనలు చాలానే ఉన్నాయి. 2016లో చేసిన సర్వే ప్రకారం పురాతన భవనాలను గుర్తించామని, వీటిని విడతల వారీగా కూల్చబోతున్నామని, అలాగే వదిలేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించిన యజమానులకు జీహెచ్‌ఎంజీ నోటీసులు జారీ చేసింది.


logo