శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 23, 2020 , 18:40:57

సమగ్ర వ్యవసాయ విధానం ప్రణాళిక సిద్ధం

సమగ్ర వ్యవసాయ విధానం ప్రణాళిక సిద్ధం

హైదరాబాద్‌: సమగ్ర వ్యవసాయ విధానంపై ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. రైతుల కష్టం లాభదాయకం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన అన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా వరి 41,76,778 లక్షల ఎకరాలు, కందులు 12,51,958 లక్షల ఎకరాలు, సోయాబీన్‌ 4,08,428 లక్షల ఎకరాలు, పత్తి 65 లక్షల ఎకరాలు, జొన్న , పెసలు, మినుములు, ఆముదం, వేరుశనగ, చెరుకు తదితర పంటలు మొత్తం వానాకాలంలో 1.3 కోట్ల ఎకరాలలో పంటల సాగుకు అంచనా వేసినట్లు మంత్రి ప్రకటించారు. రైతులను జాగృతం చేసే ప్రయత్నంలో వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెళ్లడించారు. 

డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తేనే రైతులకు లాభం అన్నది తెలియజెప్పాలన్నారు మంత్రి. వానా కాలానికి మొత్తం మనకు కేంద్రం 22.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కేటాయించిందని తెలిపారు.  విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు సమగ్ర వ్యవసాయ విధానం అమలుకు నిరంతర శ్రమ అవసరమన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి.


logo