శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 01:42:32

24.74 కోట్ల మొక్కలు సిద్ధం

24.74 కోట్ల మొక్కలు సిద్ధం

  • -వచ్చే నెల 20 నుంచి హరితహారం
  • -సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో నాటడానికి 24.74 కోట్ల మొక్కలను సిద్ధం చేసినట్టు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీశాఖ ఉన్నతాధికారులతో  హరితహారంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 20 నుంచి ప్రారంభంకానున్న హరితహారంలో నాటడానికి అటవీశాఖ 3.50 కోట్ల మొక్కలను సిద్ధంచేసిందన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల పరిధిలోని నర్సరీల్లో 21.16 కోట్ల మొక్కలను పెంచుతున్నట్టు చెప్పారు. ‘కంపా’లో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణకు 1.42 కోట్ల పెద్ద మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ హరితహారంలో పెద్దఎత్తున చింత మొక్కలు పెంచాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో 24.50 లక్షలు, గ్రామపంచాయతీ నర్సరీల్లో 81.69 లక్షల మొక్కలను పెంచుతున్నట్టు వివరించారు. కాగా, తునికాకు సేకరణ త్వరితగతిన పూర్తయ్యేలా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, అదనపు పీసీసీఎఫ్‌ స్వర్గం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo