మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 02:12:11

స్వగ్రామానికి ప్రేమయ్య మృతదేహం

స్వగ్రామానికి ప్రేమయ్య మృతదేహం
  • ఇటీవల దుబాయ్‌లో మృతి
  • మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి చొరువతో ఐదు రోజుల్లో ఇంటికి

హవేళిఘనపూర్‌: ఇటీవల దుబాయ్‌లో మృతిచెందిన మెదక్‌ జిల్లా హవేళిఘనపూర్‌ మండ లం బూర్గుపల్లికి చెందిన ప్రేమయ్య మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకొచ్చా రు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గుపల్లికి చెందిన మరెల్లి ప్రేమయ్య(40) 19 రోజుల క్రితమే బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈనెల 11న తాను ఉం టున్న బిల్డింగ్‌పై బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తోటికార్మికు లు గమనించి దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కో ల్పోయాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి చొరువ తీసుకొని మంత్రి కేటీఆర్‌ సహకారంతో విదేశాంగ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రేమయ్యకు భార్య సుశీల, కుమార్తె యశోద ఉన్నారు. 


logo
>>>>>>