మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 20:08:04

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ 'ప్రేమ ఎంత మ‌ధురం' టీమ్‌!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌  'ప్రేమ ఎంత మ‌ధురం' టీమ్‌!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ టీం మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా టీమ్ స‌భ్యులు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా మొక్క‌లు నాటుతామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లంద‌రూ వారికి తోచిన విధంగా మొక్క‌లు నాటాల‌ని ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌లో లీడ్ రోల్ పోషిస్తున్న వెంక‌ట్‌, వ‌ర్ష పేర్కొన్నారు. వీరిని ఎవ‌రూ నామినేట్ చేయ‌క‌పోయినా స్వ‌త‌హాగా చాలెంజ్‌ను స్వీక‌రించి షూట్ లొకేష‌న్‌లో మొక్క‌లు నాట‌డం జ‌రిగింది. అనంత‌రం  గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములు అవ్వాలని జీతెలుగు చానల్ హెడ్ అనురాధ గూడుర్‌, న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌, క‌ళ్యాణ వైభోగం టీం, శ్రీ‌రామ్ కె వెంక‌ట్‌ల‌కు చాలెంజ్ విసిరారు. logo