సోమవారం 13 జూలై 2020
Telangana - May 27, 2020 , 14:46:24

ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

జోగులాంబ గద్వాల : ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి.

దీంతో అప్పుడే ఊర్లోకి వచ్చిన ఆరగిద్ద - గట్టు బస్సులో గర్భిణి ఎక్కింది. పది నిమిషాల్లో గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతామనే లోగా.. ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. మొత్తానికి డ్రైవర్‌ సకాలంలో ఆస్పత్రి వద్దకు బస్సు తీసుకెళ్లాడు. కానీ బస్సు నుంచి దిగకముందే.. మగబిడ్డకు జన్మనిచ్చింది గర్భిణి. బస్సులో ఉన్న తోటి మహిళలు ఆమెకు కాన్పు చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


logo