అన్ని రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం : మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్ : అన్ని రంగాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం పలు పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణభవన్‌లో బీసీ సంఘాలతో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలను గుర్తించలేదన్నారు. రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి బీసీలకు ఉన్నత విద్యనందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 800 పైగా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.15 లక్షలు ఖర్చుపెడుతూ నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం
- ఢిల్లీలో వందలోపే కరోనా కేసులు.. 9 నెలల్లో ఇదే ప్రథమం
- ఢిల్లీని కప్పేసిన మంచుదుప్పటి.. రైళ్లు ఆలస్యం
- పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్
- కేరళ బాట పట్టనున్న పుష్ప టీం
- భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం