గురువారం 09 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 11:36:46

కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్‌శాఖలో ముందస్తు జాగ్రత్తలు

కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్‌శాఖలో ముందస్తు జాగ్రత్తలు

హైదరాబాద్‌ : రోజురోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీస్‌శాఖలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖలో అనారోగ్యంగా ఉన్న సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.

ఈ విషయంపై సీపీలు, ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే క్వారంటైన్‌లో ఉండాలని డీజీపీ సూచించారు. ఇతరులకు వైరస్‌ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.


logo