గురువారం 04 జూన్ 2020
Telangana - May 18, 2020 , 22:18:29

రాజన్న ఆలయంలో ముందస్తు ఏర్పాటు

రాజన్న ఆలయంలో ముందస్తు ఏర్పాటు

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మార్చి 19వ తేదీ నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. రెండు మాసాలు కావస్తుండడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం ప్రభుత్వం పరిమితసంఖ్యలో అనుమతిస్తే హడావిడి జరిగే అవకాశం ఉన్నందున, ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం, కోడెల క్యూలైను లాంటి వాటిలో భౌతిక దూరం పాటించే విధంగా డబ్బాలను వేయించారు. ఏర్పాట్లపై ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఉమారాణి, ఈఈ రాజేశ్‌, పట్టణ ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్‌ ఇప్పటికే రెండు దఫాలుగా ఆలయ పరిసరాలు కూడా పరిశీలించినట్లు తెలిసింది. 


logo