సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 01:13:31

కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు

కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఐటీశాఖలోని డిజిటల్‌ మీడియావిభాగం డైరెక్టర్‌ కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు లభించింది. డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో అద్భుతపనితీరుకు పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్సీఐ) ఈ అవార్డుకు ఎంపికచేసింది. శుక్రవారం బెంగళూరులో జరిగిన ‘గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ కాంక్లేవ్‌-2020’లో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై నుంచి దిలీప్‌ అవార్డును అందుకున్నారు. సంక్షేమపథకాలను డిజిటల్‌మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు దిలీప్‌కు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 


logo