ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక

- సీఎస్‌కు అందజేసిన కమిషన్ చైర్మన్, సభ్యుడు
- రెండుమూడ్రోజుల్లో త్రిసభ్య కమిటీ అధ్యయనం
- రెండోవారంలో ఉద్యోగసంఘాలతో సమావేశం
- రెండున్నరేండ్లు సుదీర్ఘంగా అధ్యయనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ స్వరాష్ట్రంలో ఏర్పాటైన తొలి పీఆర్సీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. గురువారం బీఆర్కేభవన్లో ఉద్యోగసంఘాల ప్రతినిధుల సమక్షంలో కమిషన్ చైర్మన్ సీఆర్ బిశ్వాల్, సభ్యుడు ఎండీ అలీ రఫత్.. సీఎస్ సోమేశ్‌కుమార్‌కు నివేదికను సమర్పించారు. ఈ నివేదికను రాష్ట్రప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ రెండు మూడ్రోజుల్లో అధ్యయనం చేయనున్నది.
అనంతరం ఉద్యోగ సంఘాలతో చర్చించాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని కమిషన్ రెండున్నరేండ్లు సుదీర్ఘంగా అధ్యయనం చేసి నివేదికను రూపొందించిందని సీఎస్ చెప్పా రు. నివేదికపై మొదటివారంలో అధ్యయనం చేసి.. సీఎం ఆదేశాల మేరకు రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మా మిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
మూడోవారంలో నిర్ణయం: మామిళ్ల రాజేందర్
ఈ నెల 6, 7 తేదీలలో ఉద్యోగసంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశమవుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. రెండోవారంలో మరోసారి చర్చించి మూడోవారంలో ఫిట్మెంట్, పదవీవిరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంటారన్నారు. జనవరిలోనే మొత్తం ప్రక్రియ పూర్తికావాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి తమతో కలిసి భోజ నం చేశారని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతోపాటు, కొన్నింటిపై సీఎస్‌కు తక్షణ ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు.
ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షమే: మమత
సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షమేనని మరోసారి స్పష్టమైందని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు. మంచి ఫిట్మెంట్తోపాటు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని పీఆ ర్సీ నివేదిక తెప్పించినందుకు సచివాలయ సంఘం తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి తెలిపారు. ఆంధ్రాలోఉన్న తెలంగాణ ఉద్యోగులను తీసుకువచ్చి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. పదోన్నతుల విషయంలో స్పష్టమై న ఆదేశాలివ్వడంపై ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటప్రకారం సీఎం కేసీఆర్ వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకోవడం సంతోషకరమని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కే గౌతమ్‌కుమార్ తెలిపారు.
తాజావార్తలు
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్‌లను ఆశ్రయించాలి
- రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: కలెక్టర్
- వాలీబాల్ C/O ఇనుగుర్తి
- సమస్యలు పరిష్కరిస్తా : జడ్పీ చైర్మన్
- అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
- సీసీ రోడ్డు పనులు ప్రారంభం