మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 17:18:54

సూర్యాపేట జిల్లా జాన్‌పహా‌డ్‌ దర్గాలో మొదలైన ప్రార్థనలు

సూర్యాపేట జిల్లా జాన్‌పహా‌డ్‌ దర్గాలో మొదలైన ప్రార్థనలు

సూర్యాపేట : లాక్‌డౌన్‌ ప్రభావంతో మూతపడిన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని జాన్‌పహాడ్‌ దర్గాలో తిరిగి ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. సోమవారం వక్ఫ్‌బోర్డు ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌కె మహ్మద్‌, ముజావర్‌ జాని కలిసి దర్గా ప్రధాన ద్వారాన్ని తెరిచి భక్తులకు సైదుల్‌బాబా సమాధుల దర్శనం కల్పించారు.

అనంతరం వారు బాబా సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని వక్ఫ్‌బోర్డు ఇన్స్‌పెక్టర్‌ తెలిపారు. భక్తులు భౌతిక దూరం, మాస్కులు తప్పని సరిగా ధరించాలని సూచించారు.


logo