శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 08:48:26

ప్రవీణ్‌రావుకు కిడ్నాప్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

ప్రవీణ్‌రావుకు కిడ్నాప్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ : హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేసులో సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో హైదరాబాద్‌ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అఖిలప్రియ భర్త మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్నాటకలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కచ్చితమైన సమాచారం లభించడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్‌ చేయించిన వీరిద్దరూ మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. అనంతరం వారిని వదిలేసి వేర్వేరు మార్గాల్లో హైదరాబాద్‌ దాటి పారిపోయారు. అనంతరం కొన్ని గంటలపాటు భార్గవరామ్‌, గుంటూరు శ్రీను ఫోన్లలో మాట్లాడుకున్నాక పోలీసులకు దొరకకూడదని తమ సిమ్‌కార్డులను పారేశారు. సాంకేతిక ఆధారాలతో వీరిద్దరూ కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బుధవారం ఆళ్లగడ్డలో భూమా కుటుంబం కారు డ్రైవర్‌ను అదుపులోకి పోలీసులు విచారించారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు పోలీసుల విచారణలో అఖిలప్రియ విచారణకు సరిగా సహకరించడం లేదని తెలుస్తోంది.