ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:00:13

‘ప్రాణం పంచే మనసున్న పోలీస్‌' గీతావిష్కరణ

‘ప్రాణం పంచే మనసున్న పోలీస్‌' గీతావిష్కరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచి, ఆలపించిన ‘పోలీస్‌, పోలీస్‌.. తెలంగాణ పోలీస్‌, ప్రాణం పంచే మనసున్న పోలీస్‌' అనే గీతాన్ని పోలీస్‌ప్లాగ్‌డేలో భాగంగా డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి శనివారం డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. పాటలో పోలీసు సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్‌రెడ్డి చెప్పారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న మాదిరిగానే.. ప్రజల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను చూస్తే రక్షకదేవోభవ అనేరోజులు వస్తాయని కీరవాణి అన్నారు. గేయ రచయిత అనంత్‌శ్రీరామ్‌ ఈ పాటను రచించగా, ఎడిటర్‌గా హైమారెడ్డి పనిచేశారు. కార్యక్రమంలో సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఉమేశ్‌షరఫ్‌, జితేందర్‌, సందీప్‌శాండిల్య, శివధర్‌రెడ్డి, నాగిరెడ్డి, బాలనాగదేవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అంతకుముందు డీజీపీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకతోపాటు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ఐక్యత దివస్‌లో డీజీపీ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు.