బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 19:47:02

తెలంగాణతో ప్రణబ్‌ది విడదీయలేని బంధం : మంత్రి సత్యవతి రాథోడ్‌

తెలంగాణతో ప్రణబ్‌ది విడదీయలేని బంధం : మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌ : తెలంగాణతో ప్రణబ్‌ ముఖర్జీది విడదీయలేని బంధమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రణబ్‌ మృతికి సోమవారం ఆమె సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కమిటీకి నాయకత్వం వహించి రాష్ట్ర సాకారంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ప్రణబ్‌ అని ఆమె కొనియాడారు. ప్రణబ్‌ గొప్ప వ్యక్తి, మేధావి అని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo