సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 19:31:07

ప్రణబ్‌ మరణం దేశానికి తీరని లోటు : మంత్రి జగదీశ్‌రెడ్డి

ప్రణబ్‌ మరణం దేశానికి తీరని లోటు : మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ప్రణబ్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించి మాట్లాడుతూ తెలంగాణ సమాజం ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీ చైర్మన్‌గా ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం బిల్లు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని, అలాంటి మహానేత మరణంతో ఏర్పడిన లోటు పూడ్చలేనిదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo