మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 12:10:14

తెలంగాణ అంశాన్ని యూపీఏ సీఎంపీలో చేర్చారు: ఈట‌ల

తెలంగాణ అంశాన్ని యూపీఏ సీఎంపీలో చేర్చారు: ఈట‌ల

హైద‌రాబాద్‌: గొప్ప ఆశ‌యం సాధించావ‌ని సీఎం కేసీఆర్‌ను ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మెచ్చుకున్నార‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌తో క‌లిసి అనేక‌సార్లు ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని క‌లిశామ‌ని చెప్పారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ సంతాప తీర్మాణ ప్ర‌వేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ సంతాప‌ తీర్మానానికి ఆమోదం తెలుపుతున్నాన‌ని మంత్రి అన్నారు. ప్ర‌ణ‌బ్‌ను కేసీఆర్ ఎప్పుడూ పితృస‌మానుడిగా చూశార‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు బీడీ కార్మికుల‌కు 10 వేల ఇళ్లు కేటాయించార‌ని వెల్ల‌డించారు. 

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ క‌మిటీకి అనేక విన‌తులు ఇచ్చామ‌ని అన్నారు. కొన్నిరోజుల‌పాటు ఢిల్లీలో ఉండి తెలంగాణ అంశంపై ప్ర‌ణ‌బ్‌తో చ‌ర్చించామ‌న్నారు. యూపీఏ కామ‌న్ మినిమ‌మ్‌ ప్రోగ్రామ్ (సీఎంపీ)లో తెలంగాణ అంశం ఉండేలా ప్ర‌ణ‌బ్ కృషిచేశార‌ని తెలిపారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం అన్ని రాజ‌కీయ పార్టీల‌ను కేసీఆర్ ఒప్పించార‌ని, ఆయా పార్టీల నేత‌ల ఆమోద ప‌త్రాల‌ను ప్ర‌ణ‌బ్ క‌మిటీకి ఇచ్చామ‌ని గుర్తుచేసుకున్నారు.


logo