ఆదివారం 31 మే 2020
Telangana - Apr 30, 2020 , 14:32:28

మామిడి కాయలు అమ్ముకుంటున్న ప్రకాశ్‌రాజ్‌ కొడుకు

మామిడి కాయలు అమ్ముకుంటున్న ప్రకాశ్‌రాజ్‌ కొడుకు

హైదరాబాద్‌ : సౌత్‌ ఇండియాలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌. బాలీవుడ్‌లోనూ తన సత్తా  ఏంటో నిరూపించకున్నాడు. విలన్‌, తండ్రిపాత్రలు.. పాత్ర ఏదైనా అందులో జీవిస్తాడు ప్రకాశ్‌రాజ్‌. రీల్‌లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ సామాజిక స్ఫహ ఉన్న వ్యక్తి ప్రకాశ్‌రాజు. తప్పును తప్పు అని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి ప్రకాశ్‌రాజ్‌. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 40 రోజులుగా అందరూ ఇళ్లకే పరిమియ్యారు. సినిమావాళ్లకు నో షూటింగ్స్‌. దీంతో ప్రకాశ్‌రాజ్‌ తన ఫామ్‌హౌస్‌లో భార్య పిల్లలతో కసిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. రీసెంట్‌గా ఫామ్‌హౌస్‌లో పండిన మామిడి కాయల మధ్య తన కొడుకు కూర్చున్న ఫొటోను టిట్వర్‌లో పోస్ట్‌ చేసి మా వాడు మామిడికాయల వ్యాపారి అయ్యాడంటు కామెంట్‌ పెట్టాడు.

ప్రకాశ్‌రాజ్‌ నిర్వహిస్తున్న వ్యవసాయక్షేత్రం అద్భుతం. అందులో అన్ని రకాల పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. మరిన్ని ఫొటోలు.. వీడియోలు మీకోసం..