శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 20:16:45

వాట్సాప్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ..

వాట్సాప్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ..

వనపర్తి : కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష తెలిపారు.  అయితే ఫిర్యాదుదారులు ఏలాంటి నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు వారి ఫిర్యాదులను వాట్సప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పంపించ వచ్చని సూచించారు. ఫిర్యాదులను  వెంటనే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదును స్పష్టంగా  పేపర్ పై రాసి ఫొటో తీసి  వాట్సాప్ నంబర్ 7780 580106 కు పంపించాలని..లేదా  [email protected] మెయిల్ కు పంపించాలని  సూచించారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే జిల్లా అధికారులు ప్రజావాణి మెయిల్ కు లేదా పైన పేర్కొన్న వాట్సాప్ నంబర్ కు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు.


logo