మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 24, 2020 , 09:24:42

ప్రజా చైతన్య రథం ద్వారా కరోనాపై అవగాహన

 ప్రజా చైతన్య రథం ద్వారా కరోనాపై అవగాహన

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ప్రజలను చైతన్య పరచడానికి ప్రజా చైతన్య రథం  ఎంతో శ్రద్ధతో డిజైన్ చేసి  తయారు చేయించారు. ప్రజా చైతన్య రథం నిన్న రావడం జరిగింది. ఈరోజు సిద్దిపేట పట్టణం హై స్కూల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మార్కెట్ లో,  డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన మార్కెట్ లో కరోనా వ్యాధి నివారణ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి, ప్రజా సంక్షేమం, ప్రజా రక్షణ గురించి, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లాక్ డాగ్ ఈనెల 31 వరకు ప్రకటించినందున సీఎం మాట్లాడిన వీడియో, గౌరవ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడిన వీడియో,  మరియు డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడిన వీడియో, పోలీస్ కమిషనర్ మాట్లాడిన వీడియో, మరియు వివిధ సెలబ్రెటీలు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ ను ప్రజలకు ప్రజల ముందు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ గారు మాట్లాడుతూ తొలిసారిగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక పట్టణాల్లో అవగాహన కల్పిస్తాం. తరువాత   మండల స్థాయిలో మరియు గ్రామాలలో అవగాహన కల్పించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ప్రభుత్వం మరియు పోలీసులు  తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని, వ్యాధి నివారణ గురించి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మరియు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటించి వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.


logo