ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 20:52:08

‘పీఎంఎస్‌ఎస్‌వై’ వైద్యశాల అభివృద్ధికి రూ. 12 కోట్లు విడుదల

‘పీఎంఎస్‌ఎస్‌వై’ వైద్యశాల అభివృద్ధికి రూ. 12 కోట్లు విడుదల

వరంగల్‌ అర్బన్‌ : వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ కళాశాల ఆవరణలో ప్రధానమంత్రి స్వస్త్‌ సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) వైద్య‌శాల‌ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం గురువారం రూ.12 కోట్లు విడుద‌ల చేసింది. దవాఖాన అభివృద్ధికి పరిపాల‌నా అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరగానే రూ.12 కోట్లు  కేటాయించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిబ‌ద్ధతో పని చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పీఎంఎస్ఎస్‌వై దవాఖానను అందుబాటులోకి తెస్తామన్నారు.

ఉమ్మ‌డి జిల్లాలో ఇప్పటికే 500 ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయని,  పీఎంఎస్ఎస్‌వై దవాఖాన పూర్తయితే అద‌నంగా 250 ప‌డ‌క‌లు అందుబాటులోకి వ‌స్తాయని తెలిపారు. క‌రోనా నియంత్రణకు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ప్ర‌జ‌ల‌తో స‌మిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కరోనా బారినపడిన వారు మానసిక స్థైర్యం కోల్పోవద్దని ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందని అన్నారు. దవాఖాన అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం కేసీర్‌కు, మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు, ఈట‌ల రాజేందర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. logo