బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 18:56:45

వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు పీపీఈ కిట్లు అందజేత

వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు పీపీఈ కిట్లు అందజేత

వరంగల్‌ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వంచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొస్తున్నారు.  ఆపత్కాలంలో మేము సైతం అండగా ఉంటామంటూ  సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎన్జీవో ప్రతినిధులు  వరంగల్ ఎంజీఎం దవాఖానకు సుమారు రూ.15 లక్షల విలువైన వెయ్యి పీపీఈ కిట్లు, రెండు వేల లీటర్ల సానిటైజర్, రెండు వేల ఎన్ 95 మాస్కులు, పది వేల చేతి తొడుగులు, పది వేల మాస్కులు అందజేశారు.


logo