ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:43:02

అన్ని జిల్లాలకు పాకుతున్న వైరస్‌

అన్ని జిల్లాలకు పాకుతున్న వైరస్‌

  • ఎన్ని పీపీఈ కిట్లు పంపిణీ  చేశారు: హైకోర్టు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కరోనావిస్తరిస్తున్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. వైద్యులకు రక్షణ కిట్లపై న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోమారు విచారణ చేపట్టింది. దవాఖానల పరిధిలో ఎన్ని పీపీఈ కిట్లు ఉన్నాయి, వైద్యులకు ఎన్ని సరఫరా చేశారు, ఇతర వసతులపై అఫిడవిట్లు దాఖలు చేయాలని గాంధీ, నిమ్స్‌, ఫీవర్‌, కోఠి, చెస్ట్‌ దవాఖానల సూపరింటెండెంట్లను ఆదేశించింది. కరోనా రోగులు అన్ని దవాఖానలకు వెళ్లేలా చర్యలు తీసుకుని గాంధీ దవాఖానపై భారం తగ్గించాలని సూచించింది. రాష్ట్రంలో 7 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని హెల్త్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారని.. వాటిని వైద్యులకు ఏ మేరకు ఇస్తున్నారో తెలుపాలని పేర్కొన్నది. అన్ని జిల్లాకేంద్రాల్లో 32 దవాఖానలను ప్రత్యేక కొవిడ్‌-19 దవాఖానలుగా గుర్తించినట్టు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. logo