గురువారం 04 జూన్ 2020
Telangana - May 23, 2020 , 11:07:57

గొర్రెకుంట బావి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

గొర్రెకుంట బావి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

వరంగల్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఒకే బావిలో లభించిన 9 మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. ఒకే బావిలో 9 మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గురువారం 4 మృతదేహాలు, శుక్రవారం మరో 5 మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమబెంగాల్‌ వాసులు కాగా, ఇద్దరు బిహార్‌, ఒకరు త్రిపుర వాసిగా పోలీసులు గుర్తించారు. ఒకే బావిలో అన్ని మృతదేహాలు దొరకడం పలు అనుమానాలు తావిస్తున్నది. ఘటనపై పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.


logo