e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home తెలంగాణ 2019 బ్యాచ్‌ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌

2019 బ్యాచ్‌ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌

  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా ఆరుగురి నియామకం
  • 2020 బ్యాచ్‌ ట్రైనీ ఐఏఎస్‌లకు జిల్లాల కేటాయింపు
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూన్‌ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆరుగురు ఐఏఎస్‌ఎలను జిల్లాలకు లోకల్‌ బాడీ అడిషనల్‌ కలెక్టర్లుగా నియమించింది. 2020 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులను క్షేత్రస్థాయి శిక్షణ కోసం అసిస్టెంట్‌ కలెక్టర్లుగా జిల్లాలకు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

లోకల్‌ బాడీ అడిషనల్‌ కలెక్టర్లు వీరే..
కామాటి వరుణ్‌రెడ్డి (కుమ్రంభీం ఆసిఫాబాద్‌), చిత్రా మిశ్రా (నిజామాబాద్‌), పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ (సూర్యాపేట), గరిమ అగర్వాల్‌ (కరీంనగర్‌), దీపక్‌ తివారీ (యాదాద్రి భువనగిరి), ప్రతిమా సింగ్‌ (మెదక్‌), అంకిత్‌ (వనపర్తి), రిజ్వన్‌బాషా (జయశంకర్‌ భూపాలపల్లి)కు లోకల్‌ బాడీ అడిషనల్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఇచ్చారు.

- Advertisement -

అసిస్టెంట్‌ కలెక్టర్లు (అండర్‌ ట్రైనీ)గా..
2020 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు మయాంక్‌ మిట్టల్‌ (కరీంనగర్‌), అపూర్వ్‌చౌహాన్‌ (నల్లగొండ), అభిషేక్‌ అగస్త్య (మహబూబాబాద్‌), మంద మకరందు (నిజామాబాద్‌), అశ్విని తానాజీ వాక్డే (మెదక్‌), బీ రాహుల్‌ (ఖమ్మం), ప్రతిభాసింగ్‌ (మేడ్చల్‌), ప్రఫుల్‌ దేశాయ్‌ (సిద్దిపేట), పీ ఖదిరవాన్‌ (నిర్మల్‌)కు అసిస్టెంట్‌ కలెక్టర్లు (అండర్‌ ట్రైనీ)గా జిల్లాలు కేటాయించారు.

పలు జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లు బదిలీ
2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులకు లోకల్‌ బాడీ అడిషనల్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న అదనపు కలెక్టర్లను బదిలీ చేసింది. బీఎస్‌ లలిత (నిజామాబాద్‌), సీ పద్మజారాణి (సూర్యాపేట), కీమ్యానాయక్‌ (యాదాద్రి భువనగిరి), బీ వెంకటేశ్వర్లు (మెదక్‌), కోట శ్రీవాత్సవ (వనపర్తి), వైవీ గణేశ్‌ (జయశంకర్‌ భూపాలపల్లి)ను బదిలీ చేసి.. పోస్టింగ్‌ ఇవ్వలేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana