బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 19, 2020 , 01:10:17

మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు

మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు
  • వెయిటింగ్‌లోఉన్న 21 మందికి పోస్టింగులు
  • పురపాలకశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ:రాష్ట్రంలో భారీ ఎత్తున మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. వెయిటింగ్‌లో ఉన్న పలువురికి పోస్టింగులు లభించాయి. 14 మందిని బదిలీ చేయగా.. వెయిటింగ్‌లో ఉన్న 21 మంది అధికారులకు పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జీహెచ్‌ఎంసీలో నలుగురు డిప్యూటీ కమిషనర్లకు పోస్టింగులిచ్చారు. వీరిలో ఇద్దరిని పురపాలకశాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపారు. మరో ఇద్దరిని వివిధ హోదాల్లో నియమించారు. కొత్తగా ఏర్పాటైన అనేక మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఇంచార్జి కమిషనర్ల ద్వారా పరిపాలన కొనసాగింది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక రాష్ట్రప్రభుత్వం పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, మున్సిపాలిటీలను అభివృద్ధి దిశగా పయనింపజేసే క్రమంలో అన్ని మున్సిపాలిటీలకు కమిషనర్లను నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.logo