సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 02:01:09

సరుకు రవాణా వాహనాలకు పోస్టర్లు: డీజీపీ

సరుకు రవాణా వాహనాలకు పోస్టర్లు: డీజీపీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆహార పదార్థాలను రవాణాచేసే వాహనాలకు పోస్టర్లు అతికించుకోవాలని వాహన యజమానులకు డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. అన్‌లోడ్‌ చేసి, తిరిగి వస్తున్న వాహనాలను అడ్డుకోవద్దని ఆయన ట్విట్టర్‌ ద్వారా పోలీసులను ఆదేశించారు. జొమాటో, స్విగ్గీ, ఊబర్‌ఈట్‌, బిగ్‌బాస్కెట్‌ తదితర ఈ-కామర్స్‌ సేవలందించే డెలివరీబాయ్‌లను అనుమతించాలని మరో ట్వీట్‌లో సూచించారు. 


logo