బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 06:57:54

మామిడి పండ్ల సరఫరాకు పోస్టల్‌ సర్వీస్‌

మామిడి పండ్ల సరఫరాకు పోస్టల్‌ సర్వీస్‌

  • ప్రారంభించిన వ్యవసాయశాఖ కార్యదర్శి

హైదరాబాద్ : ఉద్యానశాఖ, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా మామిడి పండ్లను పోస్టల్‌ సర్వీస్‌ ద్వారా జంటనగరాలలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే 5030 మంది వినియోగదారులు దాదాపు 30.19 టన్నుల మామిడి పండ్లను బుక్‌ చేసుకున్నారు. ఇతర దేశాల్లోని ఎన్నారైలు నగరంలోని తమ వారికి పెద్ద ఎత్తున మామిడిపండ్లను ఆర్డర్‌ చేసినట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.  ముందుగా ఫోన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న 280 మందికి 2180 కిలోల పండ్లను సరఫరా చేసే కార్యక్రమాన్ని బుధవారం వ్యవసాయ, ఉద్యానశాఖ కార్యదర్శి డాక్టర్‌ బీ.జనార్దన్‌రెడ్డి రెడ్‌హిల్స్‌లోని ఉద్యాన శిక్షణ సంస్థ  నుంచి జెండా ఊపి ప్రారంభించారు. బత్తాయి, హిమాయత్క్రం  మామిడిపండ్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని ఉద్యానశాఖ డైరెక్టర్‌ ఎల్‌ వెంకట్రామిరెడ్డి సూచించారు. ఉద్యానశాఖ ఏర్పాటుచేసిన వెబ్‌సైట్‌ www.tfresh.org ను ప్రపంచంలోని  టాప్‌ 10 దేశాలకు చెందిన 8,573 మంది ఎన్నారైలు బుధవారం పరిశీలించినట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. 


logo