మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 18:31:11

జీహెచ్‌ఎంసీ.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుపై నిబంధనలు విడుదల

జీహెచ్‌ఎంసీ.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుపై నిబంధనలు విడుదల

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను విడదుల చేసింది. నవంబర్‌ 1వ తేదీ తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా సైనిక సంస్థల్లో సిబ్బంది, ఖైదీలు, ఎన్నికల విధుల్లోని సిబ్బంది, దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు అవకాశం కల్పించింది.