శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 14:29:45

వలస కూలీకి పాజిటివ్‌

వలస కూలీకి  పాజిటివ్‌

యాదాద్రి భువనగిరి :   ముంబై నుంచి స్వ గ్రామాలకు తిరిగి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా లక్షణాలు బయట పడుతుండడం కలకలం రేపుతున్నది. తాజాగా జిల్లాలోని మోటకొండూరు మండలం కేంద్రానికి ముంబై నుంచి వచ్చిన ఏడుగురు వలస కార్మికుల్లో ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా వీరిని ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఫీవర్ హాస్పిటల్ కు క్వారెంటైన్‌ కోసం పంపించారు. వారికి అక్కడ కరోనా టెస్ట్‌ చేయగా మహిళకు   పాజిటివ్ అని తేలిందని మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ నారాయణరెడ్డి, సీఐ నరసయ్య, ఎస్ఐ వెంకన్న, మండల వైద్యులు తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో వీరస్వామి  బాధితుల ఇండ్లకు వెళ్లి తగు జాగ్రత్తలు సూచించారు. బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.


logo