పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం : మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : ఎవరికి పదవులు శాశ్వతం కాదని.. ప్రజలకు చేసిన మంచే శాశ్వతం అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా వనపర్తి శ్రీనివాసపురంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గడపగడపకూ వివరించాలన్నారు. కృత్రిమ దైవభక్తి, దేశభక్తితో కొందరు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘వనపర్తి రోడ్ల విస్తరణ చారిత్రాత్మకం.
తెలంగాణ అభిలాష, ఆకాంక్ష ఎంతో బలమైనవి. భాష పేరుతో కొందరు దగ్గరై తెలంగాణ అస్థిత్వాన్ని వంచించారు. ప్రేరేపిత మీడియా ఉమ్మడి రాష్ట్రంలో కొందరిని పనిగట్టుకుని గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించింది. అబద్దపు రాతలు తప్పు అని నిరూపించేందుకే తెలంగాణ మీడియా ఏర్పాటైంది. పాలకులు సహనం కోల్పోతే ప్రజలకు మేలు జరుగదు. తెలంగాణ ప్రభుత్వ పనులు వెయ్యేండ్లయినా గుర్తుంటాయి. పనిచేసే ప్రతి ఒక్కరికి కాలక్రమంలో పదవులు వస్తాయి. కావాల్సిందల్లా ఓపిక’ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్ ,సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్ మోహన్ రావు, మేడిపల్లి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు