సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 02:18:19

కేటీఆర్‌.. కేరాఫ్‌ నిజాయితీ

కేటీఆర్‌.. కేరాఫ్‌ నిజాయితీ

  • కాళేశ్వరంను జానారెడ్డి, ఉత్తమ్‌ శభాష్‌ అనాలి
  • నాగార్జునసాగర్‌ను కమీషన్ల కోసమే కట్టారా?
  • ప్రతిపక్షాలు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి
  • 50 లక్షలు లంచమిస్తూ పట్టుబడ్డ రేవంత్‌
  • మంచి నాయకులపై బురద చల్లడం సరికాదు
  • సినీనటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాభై లక్షల లంచమిస్తూ పట్టుబడిన రేవంత్‌రెడ్డి.. వం దశాతం నిజాయితీపరుడైన మంత్రి కే తారకరామారావుపై అవినీతి ఆరోపణలు చేయడం హా స్యాస్పదమని సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. అవినీతికిపాల్పడి జైలుకెళ్లొచ్చిన ఓ వ్యక్తి.. కేటీఆర్‌ను అవినీతిపరు డు అనడం బాధాకరమని తెలిపారు. ఒక ఫాం హౌజ్‌ నిర్మాణంపై దర్యాప్తునకు ఆదేశిస్తే, కేటీఆర్‌ను మంత్రి పదవికి రాజీనామా చేయాలనడం ఎక్కడి లాజిక్కో అర్థం కావడంలేదని రేవంత్‌పై మండిపడ్డారు. 

ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో పోసాని మీడియాతో మాట్లాడారు. ఒకరిని విమర్శించడానికో.. మరొకరిని పొగడటానికో తాను ప్రెస్‌మీట్‌ పెట్టలేదని చెప్పిన పో సాని.. ఎన్టీఆర్‌లాంటి నిజాయితీపరుడు, ప్రజాసేవకుడు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేటీఆర్‌ ఒక్కరే అని తెలిపారు. కేటీఆర్‌ హానెస్ట్‌పర్సన్‌ అని అభివర్ణించారు. రెండుమూడ్రోజులు గా ఆయనపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలు చూసి తాను మీడియా ముందుకురావాల్సి వచ్చిందని వివరించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు 100 శాతం నిజాయితీపరులని, భవిష్యత్‌లో వీరిద్దరూ తెలంగాణకు రెండుకండ్లు అని పేర్కొన్నారు. 

అధికారంలో ఉన్నవారిని అవినీతిపరులు అన డం ప్రతిపక్షాలకు రివాజుగా మారిందని విమర్శించారు. కేటీఆర్‌.. కేసీఆర్‌ నోట్లోనుంచి ఊడిపడ్డట్టే ఉంటారని, తండ్రిలాగే మంచివక్త అని పేర్కొన్నారు. ప్రజల మధ్య, పోలీసుల మధ్య, రాజకీయవ్యవస్థలో ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి అని చెప్పారు. ‘కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, కవిత అంతా మంచి నాయకులు. ఒకవేళ వాళ్లు అవినీతి చేసినట్టు మీవద్ద ఏదైనా ఆధారం ఉంటే వచ్చి నా చెంప మీద కొట్టండి. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను నమ్మొద్దని తెలంగాణ ప్రజలను కోరుతున్నా’ అని పోసాని చెప్పారు. కేటీఆర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తన మాటలను వెనక్కి తీసుకొని.. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మొ త్తం తిరుగుతా అని సవాల్‌ విసిరారు. 


కాళేశ్వరాన్ని చూసి అభినందించాలి

సీఎం కేసీఆర్‌ పూర్తిచేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చాలా గొప్ప ప్రాజెక్టు అని పోసాని అన్నారు. తెలంగాణలో ఒక మంచి ప్రాజెక్టు వచ్చిందని, కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటివాళ్లు శభాష్‌ అనాలని హితవు పలికారు. ప్రజలందరికీ ఉపయోగపడే ప్రాజెక్టును ‘కమీషన్ల కోసం కట్టారు’ అంటే తనలాంటి వాళ్లు ఎంతో బాధపడతారని చెప్పారు. ‘కాంగ్రెస్‌ హయాంలో నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌వంటి మంచి ప్రాజెక్టులు కట్టారు.. అప్పు డు వాటిని కమీషన్ల కోసమే కట్టారు అంటే ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుర్రపెట్టి ఆలోచించాలని అన్నారు. నిజమైన ప్రతిపక్షం ప్రజల్లో ఉండాలి.. కానీ పత్రికల్లో.. మీడియాలో కాదని చురకలంటించారు. నేటి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతిపక్షనేత ప్రజల్లో ఎలా ఉండాలో నాడు చేసి చూపించారని తెలిపారు.  

బాలకృష్ణ వ్యాఖ్యలతో నష్టం లేదు

సినీ నటుడు బాలయ్య కోపం, ఆవేశం, విమర్శ ఒక్కనిమిషం మాత్రమేనని పోసాని అన్నారు. ఆయన మాటలతో సమాజానికి వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొన్నారు.

కేసీఆర్‌ ఎక్కడ ఉంటున్నారనేది అనవసరం

సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో ఉన్నా రా.. ప్రగతిభవన్‌లో ఉన్నారా? కారులో నిద్ర పోతున్నారా? అనే వ్యక్తిగత విషయాలు అనవసరమని, ఎక్కడున్నా ప్రజలు, రైతులకు సేవచేస్తున్నారా? లేదా? అనేదే ముఖ్యమని పోసాని అన్నారు. రాష్ట్రం రావడానికి కేసీఆర్‌ ముఖ్య కారణమని, తెలంగాణ ఎలా ఉండాలో ఆయనకే బాగా తెలుసు.. రాష్ట్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని తెలిపారు. కేసీఆర్‌, జగన్‌ సమర్థులు, ఒకరినొకరు ఇష్టపడే వ్యక్తులని అన్నారు. పోతిరెడ్డిపాడు జలవివాదంపై ఇద్దరూ కూర్చొని చర్చించి పరిష్కరించుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. 


logo