మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 02:35:20

పూటకో పట్టీ!.. అదే చేతితో జైకొట్టి!

పూటకో పట్టీ!.. అదే చేతితో జైకొట్టి!

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఒక్కరోజులో చేతికున్న పట్టీని మూడుసార్లు మార్చడం.. దీనిపై ప్రత్యర్థి పార్టీ వారు సెటైర్లు వేయడం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. రెండురోజుల కిందట సిద్దిపేటలో తమ బంధువు ఇంట్లో పోలీసులకు నగదు లభించినప్పుడు ఆయన పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆ క్రమంలో పోలీసులు నెట్టివేయడంతో చేయి విరిగిందని రఘునందన్‌ ఆరోపించారు. నాటి నుంచి చేతికి రోజుకో రంగు పట్టీతో ప్రచారంలో పాల్గొంటున్నారు. తొలుత గోధుమరంగు పట్టీ కట్టారు. ఆ తరువాత నీలిరంగుకు మారారు. గోధుమరంగు పట్టీ బయటకు కనిపించకపోవడంతో ఆయన నీలిరంగు పట్టీ కట్టుకున్నారని సెటైర్లు వస్తున్నాయి. అంతేకాకుండా విరిగిన చేయిని పైకెత్తి నినాదాలు చేయడం మరీ విడ్డూరమని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నిజంగా రఘునందన్‌ చేయి విరిగిందా లేక పొలిటికల్‌ స్టంటా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.