బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 17:05:48

నిత్యావసర సరుకులను పేదలు సద్వినియోగం చేసుకోవాలి

నిత్యావసర సరుకులను పేదలు సద్వినియోగం చేసుకోవాలి

యాదాద్రి భువనగిరి: ఆలేరు నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఈ ఆపత్కాలంలో అండగా ఉంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు.  మోతకొండూర్ మండలంలోని చాడ గ్రామంలో దాత బేతి రాములు సమకూర్చిన నిత్యావసర సరుకులను పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ నివారణకు విధించిన లాక్ డౌన్ ను ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆపద సమయంలో దాతలు పేద కుటుంబాలకు సహకరించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందిర, ఎస్సై వెంకన్న, సర్పంచ్ ఎట్టమ్మ, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


logo