శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 09, 2020 , 22:49:42

కాంగ్రెసోళ్లకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయి: హరీశ్‌ రావు

కాంగ్రెసోళ్లకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయి: హరీశ్‌ రావు

సిద్దిపేట: రాష్ట్రం ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు చేసే విమర్శలకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారిందని, ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిపంట సేకరిస్తే, అందులో 34 లక్షల మెట్రిక్‌ టన్నులు తెలంగాణ నుంచే ఉన్నాయని ఎఫ్‌సీఐ ఎండీ పేర్కొన్నారని వెల్లడించారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చారాన పంట కూడా రైతుల వద్ద కొనలేదని చెప్పడం సరికాదని విమర్శించారు.

జిల్లాలోని పెద్దలింగారెడ్డిపల్లి పల్లెకుంట చెరువు కాళేశ్వరం గోదావరి జలాలతో నిండిన సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం రైతుబంధుకు సంబంధించిన రూ.3500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు. ఇప్పటికే రూ.25 వేలలోపు అప్పు ఉన్న రైతులకు  రుణమాఫీ చేస్తూ బ్యాంకుల్లో డబ్బు జమచేశామని చెప్పారు. రూ.25 వేల నుంచి లక్ష లోపు రుణాలన్న రైతులందరికీ నాలుగు దశల్లో రుణమాఫీ చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు రైతులపై వివక్ష చూపాయని విమర్శించారు.


logo