ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:08:55

మనుగడలోని సంఘాలకే చెరువులు

మనుగడలోని సంఘాలకే చెరువులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం అప్పటికే మనుగడలో ఉన్న మత్స్య సహకార సంఘాలకు గ్రామపంచాయతీలలోనే చిన్న, మధ్య తరహా చెరువులను లీజుకివ్వాలని నిర్ణయించినట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, చెరువుల్లో చేపపిల్లల విడుదల, మత్స్య సహకార సంఘాలకు చెరువుల కేటాయింపుపై రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌తో కలిసి మంత్రులు శుక్రవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులుమాట్లాడుతూ నిబంధనల ప్రకారమే చెరువుల కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


logo