ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:56

మల్యాలలో హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ

మల్యాలలో హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ

  • వచ్చే ఏడాది నుంచి ప్రారంభం
  • మహబూబాబాద్‌ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్‌ హామీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్‌ కేంద్రం(కేవీకే)కు అనుసంధానంగా హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిద్దామని సీఎం కేసీఆర్‌ స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు హామీఇచ్చారు. ప్రగతిభవన్‌లో గురువారం సీఎం కేసీఆర్‌ను కలిసిన శంకర్‌నాయక్‌ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీని మంజూరుచేయాలని కోరారు. మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్స్‌లర్‌ జే రఘోత్తంరెడ్డి 160 ఎకరాల భూమిని, కోటిరూపాయలను విరాళంగా ఇచ్చారని సీఎం కేసీఆర్‌కు వివరించారు. కేవీకేకు అనుబంధంగా హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీని మంజూరుచేయాలని కోరారు. దీనికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. 


logo