శనివారం 29 ఫిబ్రవరి 2020
సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..

సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..

Feb 15, 2020 , 07:21:41
PRINT
సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 905 సహకార సంఘాలకు గానూ 157 సంఘాలు ఏకగ్రీవం కాగా, 747 ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల పరిధిలోని 6,248 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 12 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

ఈ ఎన్నికల్లో 747 మంది గెజిటెడ్‌ అధికారులు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తుండగా, మరో 20 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.  పోలింగ్‌ ముగిసిన అనంతరం, 2 గంటల నుంచి కౌటింగ్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు వెల్లడైన మూడు రోజుల అనంతరం పాలకవర్గాల నియామకం చేపట్టనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అధికారి సుమిత్ర వెల్లడించారు. కాగా, ఎన్నికలకు ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. 


logo