ఆదివారం 24 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 16:55:48

జీహెచ్ఎంసీ.. పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల

జీహెచ్ఎంసీ.. పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ నిబంధనలు విడుదల చేశారు. నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. 

- పోలింగ్‌ ఏజెంట్‌ అదే ప్రాంత ఓటరు కార్డు కలిగి ఉండాలి

- పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థి ఒక బ్యానర్‌ ఏర్పాటుకు అనుమతి. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో కూడిన  బ్యానర్‌ ఏర్పాటుకు అనుమతి

- బూత్‌ల ఏర్పాటు కోసం అధికారుల రాతపూర్వక అనుమతి పొందాలి

- బూత్‌లు నిర్వహించే వ్యక్తులు అనుమతి పత్రాలు చూపాలి

- పోలింగ్‌ రోజున కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయకూడదు

- పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్లు పరిధిలో చరవాణులకు అనుమతి లేదు

- పోలింగ్‌ రోజున అభ్యర్థి వార్డు పరిధిలో తిరిగేందుకు ఒక వాహనానికి అనుమతి

- అభ్యర్థుల ఏజెంట్లు, కార్యకర్తల వాహనాలకు అనుమతి లేదు

- అభ్యర్థి పేరుతో ఉన్న వాహనాన్ని ఇతరులు వాడేందుకు అనుమతి లేదు

- పోలింగ్‌ రోజున ఓటర్లను వాహనాల ద్వారా తరలించడం నేరం. 


logo