శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 22:06:34

మాజీ మంత్రి నాయినికి నివాళులర్పించిన ప్రముఖులు

మాజీ మంత్రి నాయినికి నివాళులర్పించిన ప్రముఖులు

హైదరాబాద్‌ : దివంగత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ద్వాదశ దినకర్మను మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరై నాయిని నర్సింహారెడ్డితోపాటు ఆయన సతీమణి అహల్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయిని చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  నాయిని మృతి టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.