మంగళవారం 26 మే 2020
Telangana - May 02, 2020 , 01:53:14

రాజకీయ లబ్ధికే విపక్షాల విమర్శలు

రాజకీయ లబ్ధికే విపక్షాల విమర్శలు

  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి/సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం మెదక్‌ జిల్లా కొల్చారం, చిలిపిచెడ్‌ మండలాల్లోని రంగంపేట, అజమర్రి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలు రైతుల పంటల కొనుగోలులో చేతులెత్తేశాయని విమర్శించారు. అంతకుముందు సిద్దిపేటలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. జిల్లా పర్యటనలో మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


logo