అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటున్న విధానం అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ న్యూస్‌చానల్ భారత్ సమాచార్ ఎడిటర్ బ్రజేశ్ మిశ్రా కొనియాడారు. క్వింటా ధాన్యానికి రూ.1,888 మద్దతు ధర కల్పిస్తూ కేవలం ఎనిమిది రోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నదని ప్రశంసిస్తూ శనివారం ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘నేరుగా రైతుల దగ్గరికే వెళ్లి పూర్తి పంట కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి రైతుల అభ్యున్నతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. వారి బాగోగుల కోసం సీఎం దృఢ సంకల్పం తో పనిచేస్తున్నారు. రైతులనుంచి పూర్తి ధాన్యం కొన్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
- దొరస్వామి పార్దీవ దేహానికి ప్రముఖుల నివాళులు
- పీఎఫ్ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు
- ధోనీని మించిన రిషబ్ పంత్.. కొత్త రికార్డు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి