బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 22:41:47

మంచిర్యాల పోలీసుల ర‌క్త‌దానం

మంచిర్యాల పోలీసుల ర‌క్త‌దానం

మంచిర్యాల :  పోలీసు అమ‌ర‌వీరుల స్మార‌క వారోత్స‌వాల్లో భాగంగా మంచిర్యాల పోలీసులు మంగ‌ళ‌వారం మెగా ర‌క్త‌దాన శిబిరాన్ని నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి రామ‌గుండం సీపీ వి. స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. డీసీపీ ఉద‌య్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తాన్ని ఇవ్వడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటార‌న్నారు. ర‌క్త‌దానం రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడుతుందని, తలసేమియా, మూత్రపిండ సంబంధిత వ్యాధుల రోగులకు ఉప‌శ‌మ‌నం క‌లిస్తుంద‌న్నారు. ర‌క్త‌దానం చేసేందుకు స్వ‌చ్ఛందంగా ముందుకువ‌చ్చిన పోలీసు సిబ్బందిని అధికారులు ప్ర‌సంశించారు. 

ర‌క్త‌దాన శిబిరం ద్వారా 106 యూనిట్ల ర‌క్తాన్ని సేక‌రించిన‌ట్లు తెలిపారు. క్యాంపును నిర్వహించేందుకు ముందుకు వ‌చ్చిన ప‌ట్ట‌ణ ఇన్‌స్పెక్ట‌ర్లు ముత్తులింగ‌య్య‌, ట్రాఫిక్ వింగ్ ప్ర‌వీణ్ కుమార్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లకు అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచిర్యాల ఇన్‌చార్జీ ఏసీపీ జి. న‌రేంద‌ర్‌, మారుతి, రాజ‌మౌళి గౌడ్‌, ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల యూనిట్ చైర్మ‌న్ కె. భాస్క‌ర్ రెడ్డి, వైస్ చైర్మ‌న్ సీహెచ్ మ‌హేంద‌ర్ కోశాధికారి ప‌డాలా ర‌వీంద‌ర్‌, ఐఆర్‌సిఎస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు వి మధుసూధన్ రెడ్డి, ఓల్డ్ఏజ్ హోం ఇన్‌ఛార్జి కె సత్యపాల్ రెడీ పాల్గొన్నారు.