మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 17:49:30

ఏఎస్‌ఐ మహ్మద్‌ రఫీ పాటతో పోలీసుల డ్రిల్‌..వీడియో

ఏఎస్‌ఐ మహ్మద్‌ రఫీ పాటతో పోలీసుల డ్రిల్‌..వీడియో

వీడియో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్‌ రఫీ. తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో అసిస్టెంట్‌ సబ్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొత్తగా ట్రైనింగ్‌ తీసుకుంటున్న పోలీసులకు మహ్మద్‌ రఫీ తనదైన శైలిలో పాఠాలు చెప్తూ..అందరి దృష్టి తనవైపుకు తిప్పుకునేలా చేస్తున్నారు. మైదానంలో ఫిజికల్‌ ట్రైనింగ్‌ సెషన్‌లో బాలీవుడ్‌ లెజెండ్‌ సింగర్‌ మహ్మద్‌ రఫీ పాడిన ధాల్‌ గయా దిన్‌ పాడుతూ అందరితో కవాతు చేయించారు. 1970లో వచ్చి హంజోలి చిత్రంలోని ఈ పాటను మహ్మద్‌ రఫీ పాడారు. డ్రిల్‌ శిక్షకుడి పనితీరుకు హాట్సాఫ్‌.. అంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు.

ట్రైనింగ్‌ ట్యూన్స్‌ బై రఫీ..అనే క్యాప్షన్‌తో ఐపీఎస్‌ అసోసియేషన్‌ ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. శిక్షణ తీసుకుంటున్న పోలీసులకు ఉపశమనం కోసం దేశభక్తితో కూడిన పాటలు పాడుతూ సెషన్‌ నిర్వహిస్తున్నట్లు ఏఎస్‌ఐ మహ్మద్‌ రఫీ చెప్పారు. 2007 నుంచి నేను ఇలా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా. ప్రతీ రోజు ఉదయం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. లెజెండరీ సింగర్‌ పేరు పెట్టుకున్న రఫీ మొత్తానికి ఆయన పాటతో అందరిలో జోష్‌ నింపుతున్నారు. 


logo