బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 09:06:45

పోలీసుల అష్టదిగ్బంధనంలో తిర్యాణి అటవీప్రాంతం

పోలీసుల అష్టదిగ్బంధనంలో తిర్యాణి అటవీప్రాంతం

ఆసిఫాబాద్‌: కుమ్రం భీం జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. గత కొన్ని రోజులుగా మవోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ సహా మరో ఏడుగురు నక్సల్స్‌ అడవిలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. ఐదు రోజుల క్రితం అడవిలో కూబింగ్‌ చేస్తున్న పోలీసులకు భాస్కర్‌ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు.   

ఈనెల 14న తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసులు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అడవీ ప్రాంతంలో నక్సల్స్‌ కోసం పోలీసు బలగాలు భారీగా మోహరించడంతో తిర్యాణి మండలంలోని ఆదివాసీ గ్రామాల ప్రజలు భయంతో కాలం వెల్లదీస్తున్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి శుక్రవారం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమావేశమైన డీజీపీ, పలు సూచనలు చేశారు. నిన్న రాత్రి కాగజ్‌నగర్‌లో బసచేశారు.


logo