బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 11:44:05

కదంబ అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

కదంబ అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కదంబ అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను జిల్లా ఇంచార్జ్ ఎస్పీ, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒకరు ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన చుక్కలు ఉన్నట్లు తెలిపారు. మరొక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. జిల్లాలో మావోయిస్టు నేత భాస్కర్ తో పాటు ఐదుగురు సభ్యుల బృందం కద౦బ అడవుల్లోనే సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో తృటిలో తప్పించుకున్న భాస్కర్, ఇతర మావోయిస్టు సభ్యుల కోసం కదంబ అడవులను పూర్తిగా గాలిస్తున్నట్లు జిల్లా ఇంచార్జీ ఎస్పీ పేర్కొన్నారు.
logo